Nidhhi Agerwal: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నిధి అగర్వాల్.. ఏమైందంటే?

నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) అందరికీ సుపరిచితమే. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అటు తర్వాత అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసింది. అయితే రామ్ తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఈమె స్టార్ డం సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస సినిమాల్లో ఛాన్సులు లభించాయి. ప్రస్తుతం ఈమె రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ కాగా ఇంకోటి.. ప్రభాస్ తో చేస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా కావడం విశేషం. ఇదిలా ఉంటే. తాజాగా ఈమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం హాట్ టాపిక్ అయ్యింది.

Nidhhi Agerwal

వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వల్ల నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) వేధింపులకు గురయ్యిందట. దీంతో ఆమె మానసికంగా ఆందోళనకి లోనయ్యినట్టు తెలుస్తుంది. ఆమె ఇన్ స్టా అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి దారుణంగా వేధిస్తున్నాడట. నిధితో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడట.

దీంతో నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ‘సదరు వ్యక్తి వేధింపుల వల్ల నేను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. దయచేసి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని’ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. నిధి అగర్వాల్ కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు..ఆమె తరఫున విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Game Changer First Review: శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామా.. ఎలా ఉంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus