యువకుడి పై ఫైర్ అయిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ..!

  • December 1, 2019 / 04:30 PM IST

‘జనాల మైండ్ సెట్ మారాలి’.. ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..! అదేనండీ ‘సింహా’ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్. తాజాగా యువ వైద్యురాలు ప్రియాంకా రెడ్డిని నలుగురువ్యక్తులు కలిసి అత్యాచారం చేసి.. ఆ తరువాత ఆమెను కిరోసిన్, పెట్రోల్ పోసి దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఓ యువకుడు .. ‘మీరు ఇలాంటి హాట్ హాట్ లుక్స్ ను జనాలకి చూపించకండి.. మీలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలను రేప్ చేసేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు.

దీనికి నిధి అగర్వాల్ బదులిస్తూ.. “‘నీ ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి. దయచేసి నీ అడ్రెస్ నాకు పంపిస్తే.. మీకు ‘పింక్’ సినిమా పంపిస్తాను. మీకు అది అవసరం” అంటూ మండి పడుతూ రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో నిధిని తన అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉండడం కోసం.. తమ గ్లామర్ ను చూపిస్తూ ఉంటారు. సాధారణంగా హీరోయిన్లు గట్టిగా ఉంటే.. 5 సంవత్సరాలు వరకే స్టార్ స్టేటస్ ను అనుభవించగలరు. కాబట్టి స్కిన్ షో లు చేస్తుంటారు అనేది అందరం అర్థంచేసుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus