అల్లుడు శ్రీను కోసం ఐటమ్ భామగా మారిన నిధి..!

  • March 21, 2020 / 07:00 PM IST

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే ఆయినా, మాస్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి బెల్లంకొండ సురేష్ బడా నిర్మాత కావడంతో ఆరంగేట్రమే చాలా రిస్క్ చేసి సినిమా చేశారు. ఆయన మొదటి చిత్రం అల్లుడు శ్రీను 30కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించి సంచలనం రేపారు. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా, తమన్నా ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇక ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమైన సాయిశ్రీనివాస్ క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రంతో హిట్ అందుకున్నాడు. తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్నే నమోదు చేసింది.

కాగా ప్రస్తుతం ఈయన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అల్లుడు అదుర్స్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కొరకు నిధి అగర్వాల్ ని తీసుకున్నారని టాక్. ఆ పాట కోసం నిధికి బాగానే ముట్టచెప్పారని తెలుస్తున్న సమాచారం. ఇస్మార్ట్ హిట్ తర్వాత కూడా సరైన ఆఫర్స్ లేని నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్స్ కి సైతం ఒకే అనేస్తుంది. నిధి మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అల్లుడు అదుర్స్ మూవీలో నభా నటేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus