వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో మిస్టర్, అంతరిక్షం 9000 కే.ఎం.పీ.హెచ్ సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయడానికి దర్శకులు సైతం పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్య ఏదో ఉందని వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని కామెంట్లు ప్రచారంలోకి వచ్చాయి. అటు లావణ్య కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ ఈ వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడలేదు.
అయితే నిహారిక ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ గురించి గత రెండు రోజులుగా ప్రచారంలోకి వస్తున్న వార్తల గురించి ప్రశ్న ఎదురైంది. వరుణ్ లావణ్య పెళ్లి వార్తలపై స్పందించాలని నిహారికను అడగగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని తెలిపారు. కేవలం డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ గురించి మాత్రమే తాను మాట్లాడతానని ఆమె చెప్పుకొచ్చారు.
నిహారిక స్పందించకపోవడంతో వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ వార్తలకు సంబంధించి మరింత కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అయితే అతి త్వరలోనే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరో వైపు ఆన్ లైన్ నెగిటివిటీ గురించి నిహారిక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ ఎంతోమంది మూర్ఖులు ఉంటారని ఆమె అన్నారు.
అటెన్షన్ కోసం మరీ మూర్ఖంగా మారుతున్నారని అలాంటి వాళ్లను పట్టించుకోకుండా ఉండటమే మంచిదని నిహారిక తెలిపారు. నేను కాలు మీద కాలు వేసుకోవడంపై కూడా విమర్శలు చేశారని డ్రెస్ వల్ల ఇబ్బంది ఉండటంతో నేను అలా చేశానని ఆమె వెల్లడించారు. ఉపాసన చాలా సింపుల్ గా ఉంటుందని ఏ విషయంలో కూడా గొప్పలకు పోదని నిహారిక అన్నారు.