మెగాడాటర్ నీహారిక కొణిదెల డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నీహారిక వివాహం జరగనుంది. ఆగస్టు 13న వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇప్పటికే మెగా ఫ్యామిలిలో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. నీహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందని..
త్వరలోనే పెళ్లి ముహూర్తం అనౌన్స్ చేస్తామని ఇటీవల నాగబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వరుడి తండ్రి జె.ప్రభాకర్ రావు తెలిపారు. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర్ రావు దంపతులు.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి..

ఆశీర్వచనం తీసుకున్న అనంతరం పెళ్లి టైమ్ ను, వివాహ వేదికను ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మెగాఫ్యామిలీ, వరుణ్ తేజ్ ఈ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల నిహారిక తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చింది. దీనికోసం అందరూ కలిసి గోవా వెళ్లొచ్చారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?
