Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్ ‘ఓజీ 2’.. డైరక్టర్ క్లారిటీ ఇచ్చేశారా?
- August 6, 2026 / 01:07 PM ISTByFilmy Focus Desk
‘ఓజీ 2’ సినిమా ఉంటుంది అని ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్ స్టేజీ మీదే పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. దానికి తగ్గట్టుగా పనులు చూసుకోండి అని ‘ఓజీ’ క్రియేటర్స్‌కి చెప్పేశారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులు ఈ విషయంలో ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈ సినిమా ఉందా? లేదా? అనే చర్చ మొదలైంది. దీనికి ఫుల్‌స్టాప్ పెడుతూ ‘ఓజీ 2’ చర్చలు అంటూ తొలుత ఓ పోస్టర్, ఆ తర్వాత ఓ వీడియో రిలీజ్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్. అయితే ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సప్పుడు లేదు.
Bloody Romeo – OG 2
ఈ లోపు దర్శకుడు సుజీత్ ఇప్పుడు డోలాయమానంలో ఉన్నారని.. ఏ సినిమా స్టార్ట్ చేయాలి అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకంటే ‘ఓజీ 2’ సినిమా అనౌన్స్‌మెంట్‌కి ముందే నానితో ఓ సినిమా అనౌన్స్ అయిపోయింది. అప్పుడు ఈ సినిమా ‘ఓజీ’ ప్రొడక్షన్ హౌస్ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే ఉండాలి. ఆ తర్వాత బ్యానర్ మారింది అనుకోండి. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే పేరు పెట్టి అనౌన్స్ చేసేశారు.

ఆ అనౌన్స్‌మెంట్ తర్వాత చిన్న గ్యాప్ కోసం సుజీత్ విదేశాలకు వెళ్లి వచ్చారు. వచ్చాక ‘బ్లడీ రోమియో’ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటుండగా ‘ఓజీ 2’ సినిమాకు సంబంధించిన ప్రచారం మొదలవ్వడంతో నాని సినిమా ఆగిపోయినట్లే, వెనక్కి వెళ్లినట్లే అనే పుకార్లు బయటకు వచ్చేశాయి. అయితే ఈ విషయంలో ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని సుజీత్ అనుకుంటున్నారట. ‘బ్లడీ రోమియో’ చేశాకనే ‘ఓజీ 2’ చేస్తారట.
ఇదంతా ఇలా ఉండగా సెప్టెంబరులో ‘ఓజీ 2’ అప్‌డేట్ ఇస్తాం అంటూ సంగీత దర్శకుడు తమన్ పదే పదే చెబుతూనే ఉన్నారు. మరి ‘బ్లడీ రోమియో’ పనులు సుజీత్ మొదలుపెడితే ‘ఓజీ 2’ అప్‌డేట్ ఎలా వస్తుంది. కాబట్టి మరో నెల తర్వాత ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందన్నమాట.
















