హసీన లాంటి చిత్రాలను ఎంకరేజ్ చేయాలి.. ‘హ్యాపీ బర్త్ డే’ పాట రిలీజ్‌లో యంగ్ హీరో నిఖిల్

ప్రియాంక డే టైటిల్ రోల్‌లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన . ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను విడుదల చేశారు. ఈ పాటకు షారుక్ షేక్ ట్యూన్‌ను అందించగా.. ప్రసాద్ నల్ల అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను యంగ్ హీరో నిఖిల్ విడుదల చేశారు.

యంగ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. సాంగ్ రిలీజ్ చేసినందుకు ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను కూడా సినిమాను చూస్తాను. కొత్త వాళ్లను, కొత్త జానర్‌‌లను అందరూ ఎంకరేజ్ చేయాలి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి తేజకు శుభాకాంక్షలు’ అని అన్నారు.

డైరెక్టర్ నవీన్ ఇరగాని మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటను హీరో నిఖిల్ గారు రిలీజ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మా లాంటి కొత్తవాళ్లకు నాని గారు, నిఖిల్ గారు, రవితేజ గారు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. మా సాంగ్‌ను ఆయన లాంచ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

నటుడు సాయి తేజ మాట్లాడుతూ.. ‘నిఖిల్ అన్న వచ్చి మా సాంగ్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన ఈ పాటను రిలీజ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. నా బర్త్ డే సందర్భంగా ఈ పాటను ఆయన రిలీజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను హీరోయిన్‌గా చేస్తున్నాను. మా చిత్రంలోని హ్యాపీ బర్త్ డే పాటను నిఖిల్ గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది.నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు.

ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నానరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus