ప్రేమ టు పెళ్ళి : నిఖిల్ కు అలా కుదిరేసింది..!

Advertisement

ఇటీవల ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్ళికి రెడీ అవుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. వారెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. మన నితిన్, నిఖిల్..! నితిన్ పెళ్ళి చేసుకోబోతున్నాడు అన్న విషయం పై ముందు నుండీ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ నిఖిల్ విషయంలో ఎటువంటి వార్తలు రాలేదు. స్వయంగా తానే ప్రకటించాడు. తన సోషల్ మీడియా ద్వారా పల్లవి వర్మ అనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలిపి..

ఆమె మోహం కనబడకుండా ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటూ వస్తున్న నిఖిల్ ఎప్పుడు ప్రేమలో పడ్డాడు.. అది పెళ్ళి వరకూ ఎలా దారితీసింది అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆశక్తి కలిగిస్తున్న తరుణంలో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. నిఖిల్ మాట్లాడుతూ…” పల్లవి నా స్నేహితుల ద్వారా పరిచయం అయ్యింది. తను డాక్టర్ ..! బేసిక్ గా నాకు సైన్స్ అంటే పిచ్చి.

పల్లవి ఎక్కువగా సైన్స్ గురించి మాట్లాడుతూ ఉండేది. నాకు అవే ఇంట్రెస్ట్ కాబట్టి.. అవి వింటూ ఉండేవాడిని. అలా మా పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దాంతో నేనే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాను. దీంతో పల్లవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే చెప్పేశారు. వెంటనే మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు” అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి ఏప్రిల్ 16నే నిఖిల్ పెళ్లి ఫిక్స్ చేసారు. కానీ కరోనా కారణంగా నిఖిల్ పెళ్ళి వాయిదా పడింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus