‘కార్తికేయ 2’ తో నిఖిల్(Nikhil Siddhartha) వంద కోట్ల హీరో అయ్యాడు. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ సక్సెస్ సాధించింది. నిఖిల్ పై రూ.50 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చేయొచ్చు అనే నమ్మకం నిర్మాతలకి కలిగేలా చేసింది. అయితే ఆ తర్వాత నిఖిల్ నుండి వచ్చిన ’18 పేజెస్’ ‘స్పై’ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ వంటి సినిమాలు నిరాశపరిచాయి. నిఖిల్ కూడా రేసులో వెనుక పడినట్టు అయ్యింది. అయినప్పటికీ నిఖిల్ ‘స్వయంభు’ అనే పాన్ ఇండియా సినిమా చేశాడు.
ఠాగూర్ మధు సమర్పణలో ‘పిక్సెల్ స్టూడియోస్’ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా రూ.80 కోట్లు. నిఖిల్ కెరీర్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అంటే ‘స్పై’ అనే చెప్పుకోవాలి. దాని కోసం దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టారు. అంటే ‘స్వయంభు’ కోసం నిర్మాతలు డబుల్ బడ్జెట్ పెట్టినట్టు లెక్క. నిఖిల్ పేరిట అంత మొత్తం బిజినెస్ అవుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
‘స్పై’ సినిమాకి కనీసం ఓటీటీ బిజినెస్ బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఏ సినిమాకి కూడా ఓటీటీ డీల్స్ అంత ఈజీగా జరగడం లేదు. అందుకే నిర్మాతలు ఈరోజు ‘స్వయంభు’ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది అంటున్నారు. తెలుగులో మాత్రమే కాదు మిగతా భాషల్లో కూడా టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. దాని కోసం టీమ్ అన్ని రాష్ట్రాలూ తిరిగి రానుంది.
వీళ్ళ కష్టం ఫలించి సినిమాకి బజ్ వస్తే.. ఓటీటీ డీల్ ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. సమ్మర్ రిలీజ్ కాబట్టి.. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మరోపక్క ఈ సినిమా వీ.ఎఫ్.ఎక్స్ పనులు ఇంకా పూర్తికాలేదు.