నితిన్…నువ్వు చాలా లక్కీ!!!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతామీ పుత్రశాతకర్ణి గర్జన అప్పుడే మొదలయింది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన నాడు అందరూ కామన్ సినిమానె అనుకున్నారు…కానీ బాలయ్యలోని రౌధ్రాన్ని క్రిష్ చూపిస్తున్న విధానం చూస్తుంటే…సంక్రాంతికి బాలయ్య మరి హిట్ కన్ఫర్మ్ అనే చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాలో బాలయ్య లుక్, బాలయ్య చెప్పిన డైలాగ్స్ వెరసి ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా…సినిమా బిజినెస్ కూడా హాట్ హాట్ గా…అమ్ముడుపోతుంది. ఇదిలా ఉంటే ….‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో హీరో నితిన్ అదృష్టవంతుడు అని అందరూ అంటున్నారు.

ఎందుకు అలా అంటే…హీరో నితిన్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో ఏం ఆలోచించాడో ఏమో కానీ.. మిగతా బయ్యర్ల కంటే చాలా ముందుగా స్పందించాడు. నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసేసుకున్నాడు. అప్పుడు అతను రూ.11.25 కోట్లకే హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా హక్కులు కొనాలి అంటే దాదాపుగా 14 నుంచి 15కోట్లు పెట్టాల్సి వచ్చేది…ఎందుకంటే సీడెడ్ ఏరియా వరకే రూ.9 కోట్లు పలికింది ‘శాతకర్ణి’. మామూలుగా నైజాం ఏరియాలో 60 శాతం రేటు పలుకుతుంటుంది సీడెడ్లో ఏ పెద్ద సినిమాకైనా. ఇక మిగతా ఏరియాల్లోనూ ‘శాతకర్ణి’ రేట్లు భారీగానే ఉన్నాయి. ఒక్క గుంటూరు జిల్లాకే రూ.4.5 కోట్లు పెట్టారు. అలాంటిది నైజాం హక్కులు రూ.11.25 కోట్లు మాత్రమే అంటే ఆశ్చర్యమే. మరి ఆ రకంగా చూసుకుంటే నితిన్ ఈ మూవీ విషయంలో చాలా లక్కీ అనే చెప్పాలి….చూద్దాం మరి మన బాలయ్య సినిమా సంక్రాంతి ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus