Nithiin: ఎడిటర్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్న నితిన్

  • June 17, 2021 / 02:29 PM IST

టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి యమ స్పీడ్ మీదున్నాడు. అయితే సక్సెస్ ను మాత్రం అదే స్పీడ్ లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. సక్సెస్ అందిన ప్రతిసారి కూడా నితిన్ కు ఇది కామన్. గతంలో కూడా అఆ సినిమా సక్సెస్ అవ్వగానే వెంటవెంటనే సినిమాలు ఓకే చేసి వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక భీష్మ హిట్టయిన తరువాత కూడా అదే కంటిన్యూ అవుతోంది. నితిన్ గత ఏడాది లోనే మూడు సినిమాలతో రావాలని అనుకున్నడు కానీ కరోనా వలన ప్లాన్ వర్కౌట్ కాలేదు.

ఇక ఈ ఏడాది మొదట్లోనే పెద్దగా గ్యాప్ లేకుండా చెక్, రంగ్ దే సినిమాలతో వచ్చాడు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఇక నెక్స్ట్ మాస్ట్రో సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అదే విధంగా భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా నితిన్ వేగాన్ని పెంచుతున్నాడు. ఇటీవల మరొక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టెంపర్, బిజినెస్ మెన్ వంటి సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన ఎస్‌ఆర్‌ శేఖర్‌ దర్శకుడిగా మారబోతున్నాడు.

 

ఇటీవల అతను నితిన్ కు కథను వినిపించగా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. అలాగే వక్కంతం వంశీతో కూడా ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్న నితిన్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus