Nithiin: నితిన్ కొత్త మూవీ అలా ఉండబోతుందా?

  • March 1, 2022 / 10:40 PM IST

రచయితగా, దర్శకుడిగా వక్కంతం వంశీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించారు. బన్నీ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమాకు ప్రశంసలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ గా నిలవలేదు. ఈ డైరెక్టర్ రెండో సినిమా నితిన్ హీరోగా తెరకెక్కుతోంది.

టాగోర్ మధు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కాగా ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయిందని బోగట్టా. జూనియర్ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను వక్కంతం వంశీ మరీ సీరియస్ గా తెరకెక్కించడం కూడా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఒక కారణమైందని కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో బిజీగా ఉన్న నితిన్ ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే వక్కంతం వంశీ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

రెండో సినిమాతో వక్కంతం వంశీ సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడి కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. నితిన్ తో వక్కంతం వంశీ తెరకెక్కించే సినిమా సక్సెస్ సాధిస్తే వక్కంతం వంశీకి సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. రచయితగా వక్కంతం వంశీకి భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు.

పోకిరి, కిక్ కథలను పోలి ఉండే కథతో వక్కంతం వంశీ నితిన్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ నితిన్ తో వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus