Devara: దేవరలో సైఫ్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా.. కొరటాల ఏం చేస్తారో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  , జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  జంటగా కొరటాల శివ (Koratala Siva)  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara)   సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ప్రస్తుతం ట్విట్టర్ లో దేవర ట్రైలర్, జూనియర్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే కేవలం ఇంటర్వ్యూ కోసమే ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా కలిశారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Devara

ఈ కాంబోలో సినిమా భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈ కాంబో నుంచి ఇప్పట్లో సినిమా ఆశించడం కష్టం అని చెప్పవచ్చు. మహేష్ బాబు (Mahesh Babu)  సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సైతం ఒక సినిమా అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవర (Devara) ట్రైలర్ యూట్యూబ్ లో సైతం సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

ఈ ట్రైలర్ విడుదలకు సమయం దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. దేవర (Devara) ట్రైలర్ కోసం అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  జుట్టు ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒకలా ఉండటం గ్లింప్స్ లో మరో విధంగా ఉండటం ఈ సందేహాలకు తావిస్తోంది.

మరి సైఫ్ ను సైతం కొరటాల శివ డ్యూయల్ రోల్ లో చూపిస్తారో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దేవర1 బ్లాక్ బస్టర్ హిట్ అయితే దేవర2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రికార్డుల విషయంలో దేవర (Devara) లెక్కలు ఊహించని స్థాయిలో మారిపోతున్నాయి.

రీ రిలీజ్..లలో ‘మురారి’ నెంబర్ 1 … కానీ..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus