నితిన్ కు అప్పుడు వర్కౌట్ కాలేదు.. ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా ఉంది..!

అల్లరి నరేష్, నితిన్… ఇద్దరిదీ డిఫరెంట్ ఇమేజ్. ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ హీరో.. ఇప్పుడు సీరియస్ మూవీస్ కూడా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇక నితిన్ ఒకప్పుడు లవ్ స్టోరీస్ ఎక్కువ చేసే వాడు.. కానీ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ మూవీ చేస్తున్నాడు. మరి వీళ్లిద్దరికీ ఒకే సెంటిమెంట్ ఎలా రిపీట్ అవుతుంది? అనే డౌట్ మీకు రావచ్చు. అసలు మేటర్ ఏంటంటే.. అల్లరి నరేష్ ఫిబ్రవరిలో ‘నాంది’ చిత్రంతో హిట్ కొట్టాడు. కానీ నితిన్ నటించిన ‘చెక్’ చిత్రం ప్లాప్ అయ్యింది.

ఈ రెండు చిత్రాల్లోనూ వీళ్ళిద్దరూ ఖైదీలు గానే నటించారు. అయినప్పటికీ నితిన్ కు ‘చెక్’ కలిసి రాలేదు. కాబట్టి ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అయితే ఈ 2021 జనవరి లో అల్లరి నరేష్ మొదట ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ తరువాత ఫిబ్రవరిలో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు నితిన్ కూడా ఫిబ్రవరిలో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. హిట్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

అయితే ఇప్పుడు మళ్ళీ మార్చిలో ‘రంగ్ దే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మార్చి 26న విడుదల కాబోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ కావడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు గతేడాది నితిన్ కు ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చారు కాబట్టి.. ఈసారి ‘రంగ్ దే’ తో మరో హిట్ ఇస్తారని నితిన్ అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఎంత వరకూ వర్కౌట్ అవ్వుద్దో..!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus