జనతా గ్యారేజ్ లో నితిన్

  • June 10, 2016 / 12:18 PM IST

“అ..ఆ” సినిమా విజయానందంలో ఉన్ననితిన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను స్నేహపూర్వకంగా కలిసారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో సమంతతో కలిసి పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇక్కడకు శుక్రవారం నితిన్ వెళ్లారు.

కాసేపు సాంగ్ షూటింగ్ ని చూసి ఎన్టీఆర్ తో మాట్లాడారు. అనంతరం తన ఫీలింగ్ ని ట్విట్టర్  వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “జనతా గ్యారేజ్ సెట్స్ కి వెళ్ళాను. చాల కాలం తర్వాత ఎన్టీఆర్ ని కలిసాను. అతని డాన్స్ ని నేరుగా చూడడం ఒక ట్రీట్ లాగా అనిపించింది.” అని పోస్ట్ చేసారు. యంగ్ టైగర్ తో కలిసి దిగిన ఫోటోను పెట్టారు. ఇందులో ఎన్టీఆర్ కాస్త గడ్డం పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus