బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న నితిన్!

  • September 2, 2019 / 02:03 PM IST

ప్రస్తుతం వెంకీ కూడుముల దర్శకత్వంలో భీష్మ, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని ఒక చిత్రం మరియు వెంకీ అట్లూరి దర్శకత్వంలో “రంగ్ దే” అనే చిత్రంలో నటిస్తూ యమ బిజీగా ఉన్న నితిన్.. ఇప్పుడు నాలుగో సినిమా సైన్ చేసే పనిలో ఉన్నాడట. ఆల్రెడీ మూడు సినిమాలు చేస్తున్నవాడికి నాలుగో సినిమా గురించి అప్పుడే హడావుడి ఎందుకు అనే సందేహం అందరిలోనూ తలెత్తుతుండగా.. నితిన్ మాత్రం నా రూటే సపరేటు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం మనోడి కన్ను బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “అంధాధున్” సినిమాపై పడింది. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ సూపర్ హిట్ గా నిలవడమే కాక హీరోకి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. నిజానికి ఈ చిత్రాన్ని సిద్ధార్ట్ తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేయాలనుకొన్నప్పటికీ.. ఎందుకో అది సాధ్యపడలేదు. దాంతో తమిళంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో “జీన్స్” ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ సినిమా రూపొందుతుండగా.. తెలుగులో నితిన్ ఈ రీమేక్ లో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus