నిత్యా మేనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె అందరి హీరోయిన్లకంటే ప్రత్యేకమనే చెప్పాలి. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం అలాగే పాటలు కూడా పడటం ఈమె స్పెషల్ ట్యాలెంట్. అంతేకాదు ఏ భాషలో సినిమా చేసినా.. ఎక్కువశాతం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. గత కొంతకాలం నుండీ ఈమెకు అవకాశాలు తగ్గాయి. కేవలం ఈమె భారీ కాయం కలిగి ఉండడం వల్లనే ఈమెకు అవకాశాలు రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈమె బొద్దుగా ఉన్న ఫోటోలు చూసి సోషల్ మీడియాలో రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తాజా వాటి పై స్పందించింది నిత్యా మేనన్. నిత్యా మేనన్ మాట్లాడుతూ.. “మనం లావుగా ఉన్నామని.. మనకంటే లావుగా ఉన్నవాళ్ళు కామెంట్ చెయ్యరు. సన్నగా ఉండే వాళ్ళే కామెంట్స్ చేస్తుంటారు. మనం బరువు ఎందుకు పెరుగుతున్నామని ఎవ్వరూ ప్రశ్నించరు. ఎవరికి తోచింది వారు ఊహించుకుంటూ ఏదోదో ప్రచారం చేస్తుంటారు.నాకు ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నారు.. నాకు అలాంటిదేమి లేదు. ఎవరి ఇష్టానికి వారు ఆలోచించకుండా కామెంట్స్ చేస్తున్నారు.
నా బరువు గురించి విమర్శలు ఎదురైనప్పుడు నేను ఎవ్వరినీ ఎదురు ప్రశ్నించను, బాధపడను.చెప్పాలంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఇలాంటి వాటిని ఇగ్నోర్ చెయ్యాలి. ‘ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళ పై పోరాటం చేస్తే నేను గెలిచినట్టే’ అనేది నేను నమ్మను. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్నారా? లేక నా బరువును చూస్తున్నారా? అనే విషయాన్ని కూడ నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ పోతాను అంతే..” అంటూ చెప్పుకొచ్చింది.