Nithya Menen: ‘భీమ్లానాయక్’.. నిత్యామీనన్ ను బాధపెట్టారా..?

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపిస్తుంటుంది. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చాలా కాలం తరువాత ఆమె తెలుగులో ‘భీమ్లానాయక్’ అనే సినిమాలో నటించింది. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యామీనన్ కనిపించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు.

త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. ఇప్పటికే డెబ్భై కోట్ల షేర్ సాధించిందని టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమా విషయంలో నిత్యామీనన్ హర్ట్ అయిందట. అసలు విషయంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్-నిత్యామీనన్ లపై ‘అంత ఇష్టం ఏందయ్యా’ అనే సాంగ్ ను చిత్రీకరించారు. ఈ మెలోడీ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ చిత్ర ఈ పాట పాడారు. ఈ పాటకి యూట్యూబ్ లో భారీ వ్యూస్ వచ్చాయి. కానీ సినిమాలో మాత్రం ఈ పాట లేదు. దీంతో ఇంత మంది సాంగ్ ను ఎందుకు తీసేశారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. ‘మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల మధ్య కూల్ గా అనిపించే ఈ సాంగ్ సూట్ అవ్వదని..

అందుకే తీసేశామంటూ’ తమన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పాటను తొలగించడం నిత్యామీనన్ కి అసలు ఇష్టం లేదట. ఆమె బాగా ఫీలైందని.. అందుకే ప్రమోషన్స్ కి కూడా రాలేదని టాక్.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus