Nithya Menen Wedding: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యామీనన్.. వరుడు అతనేనా?

ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఒక్కో సెలెబ్రెటీ వారు ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకొని పూర్తిగా వైవాహిక జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఇకపోతే ఎంతోమంది హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్, అలియా భట్ ఇండస్ట్రీకి చెందిన హీరోలను వివాహం చేసుకున్నారు. అదేవిధంగా కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కి ను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరో జంట కూడా పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్ గురించి అందరికీ సుపరిచితమే.ఈమె కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ మలయాళీ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ అన్న తర్వాత వారి గురించి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతుంటాయి.

అయితే ఇప్పటివరకు ఇలాంటి గాసిప్స్ ఒకటి కూడా నిత్యామీనన్ గురించి వినబడలేదు కానీ ఈమె మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే ఈ వార్త ప్రస్తుతం వైరల్ కావడంతో ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోయేది సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఈమె మలయాళంలో స్టార్ నటుడుగా కొనసాగుతున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈమె సినిమాలలోకి రాకముందు అతనితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందని అయితే ఆ స్నేహం ప్రేమకు దారి తీయడంతో ఈమె పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.మరి నిత్యమీనన్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె స్పందించాల్సి ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus