Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌ ప్లానింగ్‌ భలే ఉందే!

సింగిల్‌ టాలెంట్‌ హీరోయిన్లు ఈ మధ్య కాలంలో కనిపించడం చాలా అరుదు అయిపోయింది. నటనతోపాటు మరో రంగంలోనూ తన ప్రతిభ చూపిస్తున్నారు. ఇంకొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తమనకు నచ్చిన వ్యాపారాలు చేస్తుంటే, ఇంకొందరు పాటలు పాడటం, యుద్ధ విద్యలు నేర్చుకోవడం లాంటివి చేస్తున్నారు. అలా నివేదా పేతురాజ్‌ కూడా తనలోని మరో టాలెంట్‌ చూపించడానికి సిద్ధమవుతోంది. మొన్నటికి మొన్న నివేదా పేతురాజ్‌ ఫార్ములా వన్‌ రేసింగ్‌లో కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్‌ కూడా పొందింది.

దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది కూడా. అయితే ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. అదే డైరక్షన్‌. అవును నివేదాకు దర్శకురాలిగా మారాలని ఉందట. అంతే కాదు దీనికి సంబంధించి కోర్సు కూడా పూర్తి చేసిందట. టాలీవుడ్‌లో నివేదా పేతురాజ్‌ అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఇంకా సరైన స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు రాలేదు.

ఈ సమయంలోనే ఆమె డైరక్షన్‌ కోర్సు పూర్తి చేసేసింది. త్వరలో కచ్చితంగా డైరక్షన్‌ కూడా చేస్తాను అని చెబుతోంది. అయితే ప్రస్తుతం తాను మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. నటిగా కొన్నేళ్ల ప్రయాణం తరువాత, మెగాఫోన్‌ పట్టుకుంటాను అని చెప్పింది నివేదా.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus