రామ్, నివేత థామస్ కలయికలో రానున్న లవ్ స్టోరీ!

ఎనర్జిటిక్ హీరో రామ్ తనకి సూటయ్యే కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. గత ఏడాది నేను శైలజతో మంచి హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత చేసిన హైపర్ కొంత నిరాశపరిచింది. రీసెంట్ గా వచ్చిన “ఉన్నది ఒకటే జిందగీ” విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిఫెరెంట్ కథ, లుక్ తో చేసిన ఈ సినిమా రామ్ కెరీర్ కి మంచి మలుపు ఇచ్చింది. దీని తర్వాత రెడీ మూవీకి సీక్వెల్ చేయాలనీ రామ్ భావిస్తున్నారు. అయితే రీసెంట్ గా త్రినాధ్ రావు నక్కిన ఒక అందమైన ప్రేమ కథ చెప్పారని సమాచారం. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ చిత్రాలకు కథ అందించిన  ప్రసన్నకుమార్ కలం నుంచే ఈ స్టోరీ వచ్చింది.

ఈ కథ రామ్ కి బాగా నచ్చిందని సమాచారం. ఈ కథని నిర్మించడానికి దిల్ రాజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. డైరక్టర్, హీరో, నిర్మాత ఒకే కావడంతో సినిమా పనులు మొదలైనట్టు తెలిసింది. ముందుగా హీరోయిన్ ని ఫైనల్ చేశారని టాక్. నాని జెంటిల్ మ్యాన్, నిన్ను కోరి  సినిమాల్లో మంచి నటనతో ఆకట్టుకున్న నివేత థామస్ ని ఇందులో హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు సమాచారం. సంప్రదింపులు పూర్తి అయ్యాయని సంతకాలు కాగానే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus