Balakrishna, Jr NTR: అన్ స్టాపబుల్ సీజన్2 లో అలా జరగనుందా?

  • June 22, 2022 / 07:21 PM IST

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్1 ఊహించని స్థాయిలో సక్సెస్ అయిందనే సంగతి తెలిసిందే. ఈ షో ఒక విధంగా ఆహా ఓటీటీ రేంజ్ ను మార్చింది. ఈ షో వల్లే ఆహా ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. ఈ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు గతంలో ఏ టాక్ షో మెప్పించని స్థాయిలో ఈ షో మెప్పించింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన సామ్ జామ్ సక్సెస్ కాకపోయినా ఈ షో మాత్రం సక్సెస్ అయింది.

అన్ స్టాపబుల్ సీజన్1 కు హాజరు కాని అతిథులు అన్ స్టాపబుల్ సీజన్2 కు కచ్చితంగా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అన్ స్టాపబుల్ సీజన్2 తొలి ఎపిసోడ్ కు చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వెంకటేష్, నాగార్జున కూడా ఈ షోలో సందడి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకు హాజరవుతారా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తారక్ బాబాయ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం గురించి జోరుగా చర్చ జరిగింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పర్సనల్ గా విషెస్ చెప్పి ఉండవచ్చని వెల్లడించారు. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్2 కు పిలిస్తే జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పే ఛాన్స్ ఉండదు.

బాలయ్య ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య రవితేజ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వైరల్ కాగా అన్ స్టాపబుల్ సీజన్1 ద్వారా ఆ వార్తలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకే వేదికపైకలిసి కనిపించి రూమర్లకు చెక్ పెడతారో లేదో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus