“ఊపిరి”విషయంలో మోసపోయా!!!

కింగ్ నాగార్జున, అందాల భామ తమన్నా…లవ్లీ స్టార్ కార్తి ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఊపిరి’. సరికొత్త కధ, కధనంతో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తూ…ఒకదాని వెనుక ఇంకో ఛానెల్ కు ఇంటర్‌వ్యూస్ ఇచ్చేస్తున్నాడు మన్మధుడు నాగార్జున. ఇదిలా ఉంటే…త్వరలో విడుదల కాబోయే ఈ సినిమాపై కొన్ని రూమెర్స్ టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్నాయి. అవేమిటంటే…ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక వివాదం చోటు చేసుకుందని సమాచారం….సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం…ఈ సినిమాకు పెట్టాలి అనుకున్న’ఊపిరి’ అనే టైటిల్ ని అప్పటికే నటుడు రాజా రవీంద్ర రిజిస్టర్ చేయించుకున్నాడని తెలిసిందట.

దానితో ఆ టైటిల్ ను తమకు ట్రాన్స్ఫర్ చేయమని దర్శకుడు వంశీ పైడి పల్లి రాజా రవీంద్రను అడిగినట్లు టాక్. ముందు ఒప్పుకొని రాజా రవీంద్ర, ఆ తరువాత ఒక ఒప్పందానికి లోబడి ఒకే చెప్పడంటా…ఇంతకీ ఆ ఒప్పందం ఏంటంటే సినిమా టైటిల్ ను తమకు ఇస్తే…ప్రతిఫలంగా ‘ఊపిరి’ సినిమాలో ఓ పోలీసాఫీసర్ పాత్రను ఇస్తాను అనే ప్రపోజల్ ను వంశీ పైడిపల్లి, రాజారవీంద్రకు చెప్పడంటా. ఇక దానికి సరే అని, ఎటువంటి ఆర్ధిక ప్రతిఫలం తీసుకోకుండా రాజా రవీంద్ర ‘ఊపిరి’ టైటిల్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని టాక్. అయితే ఆ తరువాత తన పాత్ర నిమిత్తం ‘ఊపిరి’ సెట్స్ పైకి వెళ్లినపుడు ఈ కేరక్టర్ ఆర్టిస్ట్ కి అసలు విషయం తెలిసిందట. తన పాత్ర చాలా చిన్నదని కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉండే రోల్ అని దీనితో షాక్ అయిన రాజరవీంద్ర చేసేది ఏమీ లేక…తన పాత్ర చేసుకుని, సైడ్ అయిపోయాడని, అదే క్రమంలో ఈ చిత్ర యూనిట్ కనీసం రాజా రవీంద్రని ఆడియోకి సైతం ఆహ్వానించకపోవడం…ఈ ఆవమానాలన్నింటినీ….తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాదపడుతున్నట్లు తెలుస్తుంది. పాపం రాజా రవీంద్ర…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus