లాభాలొస్తే పంచుకోరు కానీ..
- April 18, 2016 / 01:03 PM ISTByFilmy Focus
“సినిమాకు లాభాలు వచ్చినప్పుడు.. వాటిని పంచుకోవడానికి ఇష్టపడని డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చినప్పుడు డబ్బులు తిరిగి అడిగే అవకాశం లేదు” అంటూ ఘాటుగా స్పందించాడు దర్శకనిర్మాత పూరి జగన్నాథ్.
పూరి దర్శకత్వంలో తెరకెక్కిన “లోఫర్” కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, తమ నష్టాలని పూరి చెల్లించాలని ఇటీవల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పూరి ఇంటి దగ్గరకెళ్ళి గొడవ చేయడం తెలిసిందే. ఈ విషయంపై పూరి పై విధంగా స్పందించాడు. అయితే.. సదరు డిస్ట్రిబ్యూటర్లకు దర్శకరత్న దాసరి నారాయణరావు మద్దతు తెలిపారు. ఇప్పుడు దాసరి నారాయణరావు పెద్దరికం పుచ్చుకొని ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం చెపుతాడో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











