ఆ విషయంలో నాగచైతన్యని బీట్ చేసేవారే లేరు

కథానాయకుడిగా అద్భుతమైన ఫ్యామిలీ బాగ్రౌండ్ తోపాటు విశేషమైన పరిచయాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ కథానాయకుడిగా ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేకపోవడంతో యువ కథానాయకుడిగా మనోడిపై చిన్నచూపు ఉంటుంది. కానీ.. ఒక్క విషయంలో మాత్రం నాగచైతన్యను చూసి మిగతా హీరోలు మాత్రమే కాదు సొసైటీలోని బడా బాబులు కూడా భీభత్సంగా కుళ్లుకొంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. హీరోగా నాగచైతన్య ఇప్పుడిప్పుడే కాస్త స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ.. రేసర్ గా మాత్రం అతడికి పోటీ ఇచ్చేవాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు యావత్ హైద్రాబాద్ మొత్తం వెతికినా ఎవడూ లేదు. పోష్ కార్స్ ను సొసైటీలో తమ స్టేటస్ సింబల్స్ గా భావిస్తారు కొందరు. దాదాపు అందరు హైప్రొఫైల్ కుర్రాళ్లూ భారీ స్థాయి కార్స్ వాడుతుంటారు.

అయితే.. నాగచైతన్య వాడే పోర్చ్ మోడల్ స్పోర్ట్స్ కార్ ను మాత్రం చైతూ తప్ప ఎవరూ కనీసం నడపను కూడా లేరు. అందుకు కారణం చైతూకి ఉన్న కార్ రేసింగ్ ఎక్స్ పీరియన్స్. అందువల్ల కోటిన్నర విలువగల ఆ మోడల్ కారు కొనే స్థాయి ఉన్నప్పటికీ హ్యాండిల్ చేయడం రాక కారు ఎవరూ కొనడం లేదు. దాంతో.. రోడ్డు మీద ఏదో బొమ్మ కారు నడిపినట్లుగా ఆ బీస్ట్ మోడ్ కార్ ను చైతూ సరదాగా నడుపుకుంటూ వెళుతుండడం చూసి మిగతా హీరోలు, రిచ్ కిడ్స్ అందరూ కుళ్లుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus