టాలీవుడ్ సినిమాల్లో కామెడీ ఉంటోంది కానీ, మొత్తంగా కామెడీతోనే తయారైన సినిమాలు రావడం లేదు. ఒకవేళ ఒకటి, రెండు వచ్చినా ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి. సరైన వినోదం లేకపోవడం, అలాంటి సినిమాలను హ్యాండిల్ చేసే దర్శకులు కూడా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట నరేష్ అలియాస్ అల్లరి నరేష్ కూడా అంటున్నారు. మంచి వినోదాత్మకమైన సినిమా కథ సిద్ధంగా ఉన్నా దానిని హ్యాండిల్ చేసే దర్శకుడు దొరకడం కష్టంగా మారింది అంటున్నారు.
‘నాంది’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నరేష్… ఇటీవల వినోదాత్మక సినిమాల మీద ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. టాలీవుడ్‌లో కామెడీ సినిమాలు రాసే రచయితలు, వాటిని దర్శకత్వం వహించే దర్శకుల కొరత బాగా కనిపిస్తోందని అన్నారు. టాలీవుడ్‌లో ఎక్కువమంది కమెడియన్లు కలసి నటించే సినిమాలంటే గుర్తొచ్చే హిట్ సినిమాల్లో ‘ఎవడి గోల వాడిది’ ఒకటి. అందులో మొత్తం కమెడియన్లే కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి సినిమాలు అస్సలు రావడం లేదు. దీని కోసం నరేష్ మాట్లాడాడు.
‘‘కొన్ని రోజుల క్రితం ‘ఎవడి గోల వాడిది’ స్టయిల్ కథ ఒకటి నా దగ్గరకొచ్చింది. చాలా బాగుంది అనిపించింది. అయితే అలాంటి సినిమాను హ్యాండిల్ చేసి, చక్కగా తెరకెక్కించే దర్శకుడు కనిపించడం లేదు. సీనియర్ దర్శకులు మాత్రమే ఇలాంటి కథలు చక్కగా తీయగలరు. 50 మంది కమెడియన్లను ఒక దగ్గరకు చేర్చి, సినిమా తీయడమంటే చిన్న విషయం. అలాంటి కథను చక్కగా తీస్తే కచ్చితంగా సినిమాను ప్రేక్షకులు అలరిస్తారు’’ అని చెప్పుకొచ్చారు నరేష్. చూద్దాం ఈ మాట విని ఎవరైనా సీనియర్ దర్శకులు ముందుకొస్తారేమో. అప్పట్లో ఈవీవీగారు.. ఇప్పుడు ఈయన అని చెప్పుకునేలా ఎవరన్నా వస్తారా.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?