నూకరాజు తల్లి నిర్ణయంతో షాక్ లో ఆసియా… స్కిట్ వరకు ఓకే కానీ అంటూ?

పటాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నూకరాజు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా నూకరాజు తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక నూకరాజు కమెడియన్ ఆసియాతో కలిసి ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు.

అయితే వీరి పెళ్లికి కూడా పెద్దలు అంగీకారం తెలిపారని తెలుస్తుంది.అయితే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా వేదికపై నూకరాజు ఆసియాతో పాటు వీరి తల్లిదండ్రులు కూడా సందడి చేశారు. ఇక ఈ స్కిట్ లో భాగంగా నూకరాజు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నే స్కిట్ రూపంలో చేసి చూపించారు. ఈ క్రమంలోనే నూకరాజు ఆసియా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ స్కిట్ లో భాగమయ్యారు.

ఇక స్కిట్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఇంద్రజ జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలో నూకరాజు తల్లి వీరిద్దరి పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నూకరాజు తల్లి మాట్లాడుతూ స్కిట్ వరకు అయితే ఇది ఒకే కానీ నిజజీవితంలో అయితే మాత్రం ఇది కుదరదు మేడం అంటూ ఒక్క సారిగా వీరి పెళ్లికి ఆమె అడ్డుపడింది. ఇలా నూకరాజు తల్లి చేసినటువంటి ఈ కామెంట్స్ కు నటి ఇంద్రజతో పాటు ఆసియా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదంతా కూడా కేవలం స్కిట్ కోసం మాత్రమే ఇలా చేశారని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus