Nora Fatehi: బర్త్‌డే పార్టీలో బెల్లీ డ్యాన్స్‌తో రచ్చలేపిన ‘బాహుబలి’ బ్యూటీ నోరా ఫతేహి.. వైరల్ అవుతున్న వీడియోలు..

  • February 7, 2023 / 07:32 PM IST

నోరా ఫతేహి.. ఈ కెనడియన్ బ్యూటీ స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌.. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలోనూ ఆడిపాడింది.. బేసిగ్గా సూపర్బ్ డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి డ్యాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ‘టెంపర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘బాహుబలి’ లో ‘మనోహరా’ పాటలో మెలికలు తిరుగుతూ మతి పొగేట్టిసింది.. తర్వాత పలు సినిమాల్లో కిరాక్ స్టెప్పులతో అలరించింది. తాజాగా తన 31వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ వెళ్లింది నోరా..

అక్కడ ఓ స్పెషల్ ఓ లగ్జీరియస్ యాచ్ బుక్ చేసుకుంది.. బీచ్‌లో అందాలు ప్రదర్శనతో అదరగొట్టేసింది.. రన్నింగ్ బోట్‌లో రచ్చ రచ్చ చేసింది.. తన బర్త్‌డేకి తానే హంగామా చేసింది.. కేక్ కటింగ్, ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటి ఎంజాయ్‌మెంట్ వంటివి పక్కన పెడితే.. అమ్మడు బెల్లీ డ్యాన్స్‌తో.. వయ్యారంగా నడుమూపుతూ స్టెప్పులేస్తుంటే స్నేహితులంతా కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus