పోకిరి ట్విస్ట్‌… దూకుడు కాన్సెప్ట్‌

‘సర్కారు వారి పాట’ సినిమా అంటే ‘పోకిరి’ + ‘గీత గోవిందం’ అంటూ గత కొన్ని నెలలుగా చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ఆ రెండు సినిమాలు కలిపి ఒక సినిమాగా చూపిస్తారా? లేక ఆ రెండు సినిమాల్లోని కీలకమైన అంశాలు ఉంటాయా? లేదంటే ఆ రెండు సినిమాల మజా ఈ ఒక్క సినిమాతో ఇస్తారా అనేది తెలియడం లేదు. కానీ చిత్రబృందంం మాతరం అదే మాట చెబుతూ వస్తోంది. కానీ సినిమా సన్నిహిత వర్గాలు మాత్రం… ‘పోకిరి’ + ‘దూకుడు’ అయితే పక్కా అని అంటున్నారు.

అదేంటి.. ‘గీత గోవిందం’ అన్నారు కదా అంటారా? అంటున్నది నిజమే కానీ ఇటీవల వచ్చిన ట్రైలర్‌ చూసినా ‘గీత గోవిందం’ వాసన అయితే ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది. ఇక్కడ అలాంటి అవకాశమే లేదు. అయితే ‘గీత గోవిదం’ ఏమో కానీ ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమా వాసనలు అయితే పక్కాగా ఉంటాయి అని చెబుతున్నారు. అంటే ‘పోకిరి’ సినిమాలోని ట్విస్ట్‌, ‘దూకుడు’ సినిమాలోని హీరో – హీరోయిన్‌ కాన్సెప్ట్‌ పక్కా అంటున్నారు.

‘పోకిరి’ సినిమా మీరు చూసే ఉంటారు. మహేష్‌ ఫ్యాన్‌ అయినా కాకపోయినా ఆ సినిమా చూసుంటారు. కారణం ఆ సినిమా అందరినీ అంతలా అలరించడమే. అందులో పండుగాడు.. కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌గా మారిన సీన్‌ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా అలాంటి సీనే ఉంటుందట. లోన్‌ కలక్షన్‌ ఏజెంట్‌గా కనిపించే అజయ్‌… కీలక సమయంలో బ్యాంక్‌ హెడ్‌గా మారుతాడట. ఇక హీరోయిన్‌ వెంట హీరో పడటానికి ‘దూకుడు’లో సమంత వెంటపడ్డ సీన్‌ గుర్తు చేస్తుందట.

ఆ రెండు సినిమాల రిఫరెన్స్‌లు ‘సర్కారు వారి పాట’ సినిమాలో కనిపించడం అయితే పక్కా కానీ.. ఒకేలా ఉంటాయా అనేదే ఇక్కడ ప్రశ్న. ఆయా సినిమాల్లోని సన్నివేశాలను పరశురామ్‌ స్టైల్‌లో తీస్తే కొంచెం కొత్తగా ఉండొచ్చు. మరి పరశురాం ఏం చేశారు, మహేష్‌ ఎలా నటించాడు అనేది ఈ నెల 12న తేలిపోతుంది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus