NTR30: ఫస్ట్ షెడ్యూల్ అయ్యిందో లేదో.. ఎన్టీఆర్- కొరటాల మూవీ ఆన్ లొకేషన్ పిక్ లీక్!

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ మొదలవ్వడానికి చాలా టైం పట్టింది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన ఏడాదికి ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ మొదలవ్వడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ దశలో సినిమా లేట్ అవ్వొచ్చు కానీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్లో జరుగుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్..గా ఈ చిత్రాన్ని ఆవిష్కరించనున్నాడు కొరటాల. ‘ చావంటే, దేవుడంటే భయం లేని కొన్ని మృగాలకి తన హీరో భయాన్ని పరిచయం చేస్తాడని’ దర్శకుడు కొరటాల సినిమా పూజా కార్యక్రమాలు సమయంలో చెప్పుకొచ్చాడు.

కొరటాల చాలా కసిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు అనే విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీ 2024 లో విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. (NTR30) ‘ఎన్టీఆర్ 30’ ఫస్ట్ షెడ్యూల్ ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో ఆన్ లొకేషన్ నుండి ఓ పిక్ లీక్ అయ్యింది.

ఎన్టీఆర్ మరో ఇద్దరు ఆర్టిస్ట్ లతో నటిస్తున్న టైంలో తీసిన పిక్ ఇదని స్పష్టమవుతుంది. ఎన్టీఆర్ లుక్ అయితే స్టన్నింగ్ అనే విధంగా ఉంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది కాబట్టి.. ఆ రోజు ఎన్టీఆర్ 30 నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపే ఎన్టీఆర్ 30కి లీకులు మొదలవ్వడం షాకిచ్చే అంశం. ఈ పిక్ లీక్ అయిన కొద్ది నిమిషాలకే ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus