NTR 31: పట్టుదలతో ఉన్న తారక్.. ఆ మూవీ రిలీజ్ డేట్ మారనుందా?

ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడిగా ఇతర భాషల ప్రేక్షకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ మార్చి నెల 20వ తేదీ నుంచి మొదలుకానున్న నేపథ్యంలో కేవలం 6 నెలల్లో ఈ సినిమా షూట్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

తారక్ కొరటాల కాంబో మూవీ షూట్ అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమా 2024 సంక్రాంతికే విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2024 సంవత్సరం ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా రెండు ప్రాజెక్ట్ లతో తారక్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ లైనప్ విషయంలో ఎలాంటి కన్యూజన్ అవసరం లేదని తారక్ సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతం తారక్ కొరటాల శివ కాంబో మూవీ సెట్స్ పనులు జరుగుతుండగా ప్రశాంత్ నీల్ తారక్ కాంబో సినిమాకు కూడా భారీ సెట్స్ ఉంటాయని ఆ సెట్స్ లోనే షూట్ జరగనుందని తెలుస్తోంది. మరోవైపు రేపు జరగనున్న అమీగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా హాజరు కానున్నారు. బింబిసార ఈవెంట్ కు తారక్ హాజరు కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ నుంచి షూట్ మొదలుపెడదామని ప్రశాంత్ నీల్ తారక్ కు మాట ఇచ్చారని బోగట్టా. ఎన్టీఆర్32 గురించి కూడా త్వరలో అప్ డేట్ రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాలను వేగంగా పూర్తి చేయాలని తారక్ పట్టుదలతో ఉన్నారని సమాచారం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus