అప్పుడే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అమిజాన్ ప్రైమ్ లో వచ్చేస్తుందా..?

‘ఎన్టీఆర్ -బయోపిక్’ నుండీ ఈ సంక్రాంతికి విడుదలైన `ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు` చిత్రం మంచి టాక్ ని సంపాదించుకున్నప్పటికీ… కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ, అలాగే ‘ఏఎన్ఆర్’ గా సుమంత్ నటనకి మంచి మార్కులు పడినా…. క్రిష్ డైరెక్షన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా డైరెక్ట్ చేసినా… బుర్రా సాయి మాధవ్ అద్భుతమైన సంభాషణలు రాసినా.. ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపించలేక పోయాయనే చెప్పాలి.

‘ఎన్టీఆర్’ జీవిత కథ అని చెప్పిన ఈ చిత్రంలో కల్పితాలు ఎక్కువ ఉన్నాయని, ఈ చిత్రం ప్రతీ సన్నివేశంలోనూ.. ‘ఎన్టీఆర్ అందగాడు… గొప్పోడు….’ అంటూ అవసరం లేకపోయినా.. చీటికీ మాటికీ ఆ భజన ఎక్కువయిందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతూ వచ్చారు. అసలు నిజాలు ఈ చిత్రంలో లేవని…, అందులోనూ ఆడిషన్ కి వచ్చిన ఎన్టీఆర్ కి అంత తేలికగా అవకాశం ఇచ్చేసి.., ఎన్టీఆర్ గొప్పడు అంటూ అక్కర్లేని భజన జనాల్ని ఇబ్బంది పెట్టిందని.. అలాగే మహానటి సావిత్రిని కూడా నెగటివ్ గా చుపించారంటూ క్రిష్ ను కూడా చాలా మంది విమర్శించారు. 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి కనీసం 25 కోట్లు కలెక్షన్లు కూడా రాకపోవడం గమనార్హం. ఇక ఈ చిత్రం త్వరలో అమిజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష్యం కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం పిభ్రవరి 7 నుండీ ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చట. ఇక ఈ చిత్ర రెండవ భాగమైన ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ పిభ్రవరి 14 విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్ర ఫలితంతో క్రిష్- బాలకృష్ణ రెండవ భాగం ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రం పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా… ఇంకా ‘మహానాయకుడు’ రిలీజ్ కాకుండానే… ‘కథానాయకుడు’ చిన్న తెర పై రిలీజ్ కాబోతుండడం ఆశ్చర్యకరమైన విషయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus