ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి.నా.రె.) మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమని విషాదంలో ముంచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సినారె మరణం సినీ రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాహిత్య రంగానికి సినారె చేసిన ఎనలేనివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌తో సినారె ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.
మహానటుడు ఎన్టీఆర్ కి “నన్ను దోచుకుందువటే” వంటి ఎన్నో మధురమైన పాటలను సినారె అందించారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సి.నారాయణరెడ్డి మృతిపట్ల సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ” ఇది తెలుగు పాట మూగబోయిన వేళ!” అంటూ ట్వీట్ చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలు విలువకట్టలేవని అన్నారు. అతను లేని లోటు పూడ్చలేనిదని పోస్ట్ చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.