పది రోజుల్లో వెల్లడించనున్న ఎన్టీఆర్
- September 30, 2016 / 12:16 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అనే విషయం ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తారక్ కుటుంబ సమేతంగా ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు. అక్కడే రిసార్ట్ లో పదిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తన కొత్త సినిమా సంగతులు వెల్లడించనున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు రచయిత వక్కంతు వంశీ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లు యంగ్ టైగర్ కు కథలు చెప్పారు. తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన కథను కూడా ఎన్టీఆర్ విన్నారు. అయితే ఎవరికీ ఒకే చెప్పలేదు. ఆయన నిర్ణయం కోసం డైరక్టర్లు ఎదురుచూస్తున్నారు. సింహాద్రి తర్వాత ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపజయాలు ఎదురు అయ్యానని, ఈ సారి అలాంటి తప్పులు జరగకూడదని హిట్ ట్రాక్ ని వదల కూడదని ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నారు. కథను ఒకే చెప్పడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. పూరి జగన్నాథ్ తోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అయన సన్నిహితులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు.

















