టాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోల్లో ఎన్టీఆర్ స్టామినా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి… ఎందుకంటే లెక్కల్లో మనకు చాలామంది హీరోలే ఉన్నారు కానీ…అన్నీ పాత్రలు చెయ్యగల హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు…అందులో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా పక్కన పెడితే….సహజంగా మన టాలీవుడ్ లో ఏ హీరోకి అయినా ఫ్యాన్స్..యాంటీ ఫ్యాన్స్ సర్వ సాధారణంగా ఉంటారు అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ ఎంతటి పోసీటీవ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తారో…యాంటీ ఫ్యాన్స్ సైతం అంతే రేంజ్ లో రాంగ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు అనే చెప్పాలి.
అదే క్రమంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ టైంలో కొంచెం డివైడ్ టాక్ రావడం ఆలస్యం.. ఈ సినిమా మీద ఒక వర్గం ఏ స్థాయిలో దుష్ప్రచారం సాగించిందో సోషల్ మీడియాలో ఉన్నవాళ్లకు బాగానే తెలుసు. ఐతే మామూలుగా ఇలాంటి ప్రచారం అందరూ చేస్తారు. కానీ ఒక వర్గం మరీ శ్రుతి మించి పోయింది. ఎన్టీఆర్ ను ఎలా అయిన దెబ్బ కొట్టాలీ అన్న ఆలోచనతో ప్రముఖ టీవీ ఛానెల్ జర్నలిస్టు పేరుతో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించింది. ఆ జర్నలిస్టు పేరిట ‘జనతా గ్యారేజ్’కు వ్యతిరేకంగా ట్వీట్లు గుప్పించింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లను తక్కువ చేసి చూపిస్తూ కూడా ట్వీట్లు పెట్టారు. దీంతో అందరూ ఈ జర్నలిస్టును అపార్థం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడి మీద వ్యతిరేకత పెంచుకున్నారు. తీరా చూస్తే…ఆ జర్నలిస్టు విషయం తెలుసుకుని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు….ఈ కేటు గాల్లను పట్టుకుని పనిలో ఉన్నారు పోలీసులు.