NTR: ఆ కామెంట్లు చేసేవాళ్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జవాబు ఇదే!

  • May 27, 2023 / 05:09 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే దేవర సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్స్ వచ్చినా ఆచార్యతో పోలికలు ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

టెంపుల్ సెట్ లో దేవర షూటింగ్ జరుగుతుండటంతో ఈ కామెంట్లు వినిపించాయి. అయితే (NTR) ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ కామెంట్లకు ధీటుగా జవాబిస్తున్నారు. కొరటాల శివ ఆచార్య సినిమాకు ముందు నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు తెరకెక్కించారని అవి ఎందుకు మీకు గుర్తుకు రావడం లేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. టెంపుల్ సెట్ సీన్ ఉన్న ప్రతి సినిమా ఆచార్య అవుతుందా? అని కామెంట్లు చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాపై అనవసరంగా నెగిటివ్ కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ వరుస విజయాలతో జోరుమీదున్న సమయంలో దేవర సినిమాపై అనవసరంగా నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా నిర్మాతలు కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది. దేవర వచ్చే ఏడాది రంజాన్ పండుగ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దేవర సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ లు కూడా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus