టీజర్ రిలీజ్ చేస్తే సరిపోయిందా.. ప్రమోషన్లు ఎక్కడ

ఓ సినిమాకి ఓపెనింగ్స్ బాగా రావాలి అంటే ప్రమోషన్లు కచ్చితంగా బాగా చెయ్యాల్సి ఉంది. అలాంటిది రెండు పెద్ద సినిమాల మధ్యలో విడుదల చేయబోతున్న సినిమాకి అయితే.. ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. అలాంటిది ఇంకా ప్రమోషన్లు మొదలు పెట్టకపోవడం ఏంటి అనే సందేహం కలుగక మానదు. విషయం ఏమిటంటే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నట్టు టీజర్ విడుదల చేస్తూ ప్రకటించారు.

అయితే ఇంకా ప్రమోషన్లు మాత్రం మొదలు పెట్టలేదు. సోలో రిలీజైతే ఒక నెల ముందు ప్రమోషన్లు మొదలు పెడితే సరిపోతుంది. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ వంటి పెద్ద సినిమాల మధ్యలో విడుదల చేస్తున్నప్పుడు.. అందుకు తగ్గట్టు ప్రమోషన్లు కూడా ఉండాలి. ఈ సినిమా హీరోయిన్ మెహ్రీన్ పుట్టిన రోజు ఈరోజు. కాబట్టి ఆమె పాత్రకి సంబంధించి ఓ టీజర్ ను విడుదల చేస్తారు అనుకుంటే.. సింపులు గా ఓ పోస్టర్ వదిలేసి సరిపెట్టుకున్నారు. ఈ సినిమాకి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.. కానీ చిత్ర యూనిట్ నుండీ ఎటువంటి అప్డేట్ లు రాకపోతుండడంతో వాళ్ళు కూడా డిజప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus