టాలీవుడ్ లో నందమూరి వంశం రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు….వారి తీరే వేరు…..వారి ట్రాకే సేపరేటు….అయితే….కొంతకాలంగా భారీ హాట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ కు అటు టెంపర్ నుంచి ఇటు జనతా వరకూ వచ్చిన సూపర్ హిట్స్ ఆ కోరికను తీర్చేశాయి….అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ…అసలు విషయం అక్కడే మొదలయ్యింది. ‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళవలసిన జూనియర్ తన అనాలోచిత వ్యూహాత్మక ఎత్తుగడలు ద్వారా విలువైన కాలాన్ని వృథా చేసుకుంటూ ‘జనతా గ్యారేజ్’ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ను తన కెరియర్ కు సంబంధించి అద్భుత అవకాశంగా మార్చుకోవడంతో జూనియర్ బాగా వెనకపడిపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అంతేకాదు…ప్రస్తుతం ఎన్టీఆర్ మరో హిట్ కోసం పడుతున్న ఆరాటంలో టాలెంట్ ఉన్న దర్శకులను ఇబ్బంది పెడుతున్నాడని….విష ప్రచారం జరుగుతూ ఉంది….కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ను నమ్ముకుని ఎదురు చూస్తున్న వక్కంతం వంశీని దూరం పెటాడు అని…అంతేకాదు…ఈమధ్య జూనియర్ కు కథలు చెప్పడానికి ప్రయత్నించిన కొందరు యంగ్ దర్శకులను తన ఇంటిముందు గంటల కొద్ది వేచి ఉండేలా చూసి ఆ తరువాత వారి కథలను పూర్తిగా వినకుండా పంపించి వేసాడు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే భారీ హిట్స్ వచినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎన్టీఆర్ తప్పటడుగులు వేస్తున్నాడు అని భారే హిట్ ఇచ్చే దర్శకుడి కోసం తాను ఇబ్బంది పడుతూనే….యువ దర్శకులను ఇబ్బంది పెడుతున్నాడు అని తెలుస్తుంది.