ఎన్టీఆర్ నిరాశ పడుతున్నాడా??!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటేనే…టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అని ఇట్టే అర్ధం అయిపోతుంది…. అందంలోనూ… అభినయంలోనూ….డ్యాన్స్ లోను…డైనమిక్ మూవీస్ చెయ్యడం లోను ఎన్టీఆర్ ను మించిన హీరో లేరు అంటే బహుశా అతిశయోక్తి కాదేమో…ఇదిలా ఉంటే ఆ మధ్య ఎన్టీఆర్ వరుస పరాజయాలతో కాస్త డీలా పడ్డా….వెనువెంటనే….టెంపర్….నాన్నకు ప్రేమతో…జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టి తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు. అయితే ఆ క్రమంలోనే ఎన్టీఆర్ తన తరువాత సినిమాలపై భారీ ఫోకస్ నే పెట్టాడు…కానీ అనుకున్నట్లుగా ఇప్పుడు పరిస్థితి పెద్దగా కలసి రావడంలేదు అని ఇట్టే అర్ధం అయిపోతుంది…ఇంతకీ ఏమయ్యింది అంటే…జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్…తన అప్ కమింగ్ చిత్రాలను కేవలం టాప్ డైరెక్టర్స్ తోనే చేయాలని నిర్ణయించుకున్నాడు.

జనతా గ్యారేజ్ మూవీ ఎప్పుడైతే చిత్రీకరణ జరుపుకుంటుందో…అప్పటి నుండి ఎన్టీఆర్ మరోవైపు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో అందరూ జనతాగ్యారేజ్ అనంతరం ఎన్టీఆర్ మూవీ త్రివిక్రమ్ తోనే ఉంటుందని ఫిక్స్ అయ్యారు. అలాగే మరోవైపు పూరీ జగన్నాధ్ ని సైతం లైన్ లో పెట్టారు. అంతేకాకుండా తమిళ డైరెక్టర్ ఒకరిని సైతం లైన్ లో ఉంచి, వక్కంతం వంశీని సైతం క్యూ లో పెట్టుకున్నాడు యంగ్ టైగర్….అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ….తను ఎవరి మీద ఆశలు పెట్టుకున్నాడో…వారందరూ ఇప్పుడు జూనియర్ కి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్న డైరెక్టర్స్ ఏ ఒక్కరూ జూనియర్ కి అందుబాటులో లేరు….ఇక త్రివిక్రమ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి…చివరి నిముషంలో పవన్ కళ్యాణ్ మూవీకి రంగం సిద్ధం చేసుకోవటం ఎన్టీఆర్ కి నిరాశ కలిగించడమే కాకుండా…చాలా కోపం కూడా వచ్చింది…మరి ఎన్టీఆర్ ఏం చెయ్యబోతున్నాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus