కధానాయకుడికి భారీ నష్టాలు తప్పేలా లేవుగా..!

‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండీ వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఎన్టీఆర్’ గా బాలకృష్ణ నటన… ఆ మహానటుడు జీవితాన్ని క్రిష్ తెరకెక్కించిన విధానానికి.. విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతే కాదు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు కూడా సినిమా అద్భుతం అంటూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు. ఖర్చుకి వెనుకాడకుండా నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టు గానే డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లు పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. సుమారు 70 కోట్ల వరకు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం.. ఈ చిత్రం.. ఏ మాత్రం జోరు చూపించట్లేదు. తొలి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.7 కోట్లు మాత్రమే నమోదు చేసింది. ఇక రెండవ రోజు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. రెండవ రోజున ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 1.28 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక రెండు రోజులు కలిపి ఈ చిత్ర ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం- 2.21 కోట్లు

వైజాగ్- 0.97 కోట్లు

ఈస్ట్ – 0. 50 కోట్లు

వెస్ట్- 0.65 కోట్లు

కృష్ణ- 0.87 కోట్లు

గుంటూరు- 2.16 కోట్లు

నెల్లూరు- 0.58 కోట్లు

సీడెడ్- 0.97 కోట్లు

——————————-

ఏపీ & టీఎస్ కలెక్షన్స్- 8.91 కోట్లు

———————————

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus