దివంగత నేత, మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా… దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ ఇటీవల విడుదలయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ చిత్ర రెండో భాగం ‘ఎన్టీఆర్ -,మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పటికీ… ఇప్పుడు వాయిదా పడుతుందేమో అనే అనుమానులు కలుగుతున్నాయని ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఈ చిత్ర షూటింగ్ మరో పది రోజులు బ్యాలన్స్ ఉందట.ఆ తరువాత ఫైనల్ ఎడిట్, రీరికార్డింగ్ వంటి వ్యవహారాలు ఉన్నాయి. ఆ మధ్యరెండు, మూడు రోజులు దీని పై షూట్ చేశారట. మళ్ళీ మరో రెండు రోజుల్లో ఈ స్కీదులే కు ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. కనీసం నెలాఖరుకి కానీ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు లేవని టాక్ వినిపిస్తుంది. దాని తరువాత మరో వారం రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎలాగో ఉంటుంది. ఎంతకాదనుకున్నా విడుదల తదీ కంటే మరో వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉండబోతున్నట్టు స్పష్టమవుతుంది. కానీ సినిమా వెనక్కి వెళ్ళే చాన్స్ లేదని, ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే సినిమాకు అడ్డం పడుతుందని మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.