ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జై లవకుశ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నారు. రోజుకి మూడు గంటల పాటు జిమ్ లో శ్రమిస్తున్నారు. వచ్చే నెల సెట్స్ మీదకు ఈ సినిమా వెళ్లనుంది. అప్పుడే ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారో తెలిసేది. అయితే అంతకంటే ముందు గానే తారక్ లుక్ అధికారికంగా బయటికి రానుంది. ఈనెల 7వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభకానుంది. ఈ క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్స్ట్ దక్కించుకుంది.
ఎన్టీఆర్ ఐపీఎల్ సీజన్ (తెలుగు విభాగానికి) కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అతనితో మ్యాచ్‌లకు సంబంధించిన ప్రోమోలను కొన్ని రోజుల క్రితం షూట్ చేశారు. త్రివిక్రమ్ షూట్ చేసిన ఈ వీడియో, ఫోటోలను ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో రిలీజ్ చేయనున్నారు. తొలిసారి ఐపీఎల్ మ్యాచ్ లకు తారక్ అంబాసిడర్ గా వ్యవహరించడాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ సీజన్ కి క్రేజ్ తీసుకురావడంలో ఎన్టీఆర్ తప్పకుండా సహాయపడుతారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇక సాయంతరం ఎన్టీఆర్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.