టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో అయినటువంటి ఎన్టీఆర్(NTR) అభిమానులని ఓ న్యూస్ ఇప్పుడు తెగ టెన్షన్ పెడుతుంది. ఇప్పుడు వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్… ఈరోజు సాయంత్రం గాయపడినట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. తాజా షెడ్యూల్లో భాగంగా నిర్వహించిన ఓ యాక్షన్ ఎపిసోడ్లో.. ఎన్టీఆర్ భుజానికి గాయమైందని సమాచారం.
ఈ విషయంపై చిత్ర బృందం మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ కి గాయం అయ్యిందని.. అయితే తీవ్రమైంది కాదని తెలిపారు. అయినప్పటికీ తారక్‌ను పరీక్షించిన వైద్యులు.. ఆయనకు దాదాపు 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారట.ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా సీరియస్ గా తీసుకోవడంతో తదుపరి చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు స్పష్టమవుతోంది.
ఈ వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో.. వెంటనే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అనంతరం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ మూవీ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతారట. సమాంతరంగా నెల్సన్ దర్శకత్వంలో కూడా సినిమా చేసే అవకాశం ఉందట. పనిలో పనిగా ‘దేవర 2’ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.