NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

దేవర, వార్ 2 ఫలితాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశలో పడేశాయి. వారి ఆశలన్నీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ పైనే ఉన్నాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ సినిమాపై వస్తున్న రూమర్లు వారిని మరింత ఆందోళనకు గురిచేశాయి. ఎన్టీఆర్‌కు స్క్రిప్ట్ నచ్చలేదని, ప్రాజెక్ట్ ఆగిపోయిందని, నీల్ సినిమాను పక్కన పెట్టేశాడని గట్టిగా ప్రచారం జరిగింది.

NTRNEEL

ఈ నెగెటివ్ ప్రచారానికి చెక్ పెట్టేందుకు, మేకర్స్ ఇప్పుడు ఒక్క ఫొటోతో సమాధానం చెప్పారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఒక లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సినిమా ఆగిపోలేదని, ట్రాక్ మీదే ఉందని ఈ ఒక్క ఫొటో క్లారిటీ ఇచ్చేసింది.

ఇది కేవలం యాదృచ్ఛికంగా వచ్చిన ఫొటో కాదని, పక్కా ‘డ్యామేజ్ కంట్రోల్’ ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ‘దేవర’, ‘వార్ 2’ నిరాశ తర్వాత ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆందోళనను, సినిమాపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటే మాటలు కాదు, ఇలాంటి విజువల్ ప్రూఫ్ అవసరమని నీల్ భావించినట్లున్నారు.

ఈ ఫొటోతో ‘ప్రాజెక్ట్ షెల్వ్డ్’ అనే రూమర్ ఆగినా, ‘లుక్’ గురించిన చర్చ మాత్రం ఆగలేదు. ‘శివ’ రీ రిలీజ్ వీడియో బైట్‌లో తారక్ మరీ సన్నగా కనిపించడంపై ట్రోల్స్ వస్తున్నాయి. అయితే, నీల్ చేతిలో ఉన్నాడు కాబట్టి, లుక్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదని, బెస్ట్ ఔట్‌పుట్ రావడం ఖాయమని మరో వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ ఒక్క ఫొటోతో అన్ని పుకార్లకూ సమాధానం చెప్పిన నీల్, వచ్చే నెల (డిసెంబర్) నుంచి షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2026 సమ్మర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus