ఆర్.ఆర్.ఆర్’ హీరోలకు రాజమౌళి స్పెషల్ ఇన్విటేషన్..!

దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ – పూజా ప్రసాద్ వివాహం డిసంబర్ 30న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బంధువులు,సన్నిహితుల సమక్షంలో జైపూర్ (రాజస్థాన్ క్యాపిటల్) లో వీరి వివాహం జరుగబోతుంది. దాదాపు 250 ఎకరాల్లో ముఘల్ స్టైల్ లో ఉండే సెవెన్ స్టార్ హోటల్ లో వీరి పెళ్లికి వేదిక కానుండడం విశేషం. ఇప్పటికే రాజమౌళి తో పాటు వీరి కుటుంబ సభ్యులు కూడా జైపూర్ కు చేరుకున్నారు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ లు తమ కుటుంబాలతో కలిసి పెళ్ళి వేదికకు చేరుకున్నారు.

ఇక ఈ పెళ్ళి పనుల్లో రాజమౌళి భార్య రమా రాజమౌళితో ఎన్టీఆర్, చరణ్ ఎంతో సన్నిహితంగా ఉంటూ సందడి చేసారు.ఇంకా ఈ వేడుకలో జూ.ఎన్టీఆర్ భార్య ప్రణతి, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు కాబట్టి కచ్చితంగా రాంచరణ్, జూ.ఎన్టీఆర్ లు పెళ్ళికి హాజరవ్వాలని రాజమౌళి స్పెషల్ గా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. పెళ్ళి వేడుక పూర్తి కాగానే రాంచరణ్, జూ.ఎన్టీఆర్ లు తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నట్టు సమాచారం. అయితే రాజమౌళి కుటుంబం మాత్రం న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకొని జనవరి 2 న హైదరాబాద్ చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ షెడ్యూల్ జనవరి రెండవ వారంలో మొదలుకాబోతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus