మనిషిలో మంచి-చెడు అనేవి ఎప్పుడూ ఉంటాయి. పరిస్థితిని బట్టి ఒక్కోసారి మంచిని చెడు డామినేట్ చేస్తే.. ఇంకోసారి చెడుని మంచి డామినేట్ చేస్తుంది. ఆ మనిషి అనామకుడు అయ్యుండొచ్చు, సగటు మధ్యతరగతి వ్యక్తి అయ్యుండొచ్చు, సినిమా స్టార్ అయ్యుండొచ్చు.. కోపం అనేది కామన్ గా వచ్చేది. ఆ కోపంతోనే రామ్ చరణ్ కెరీర్ తొలినాళ్లలో మీడియాను తూలనాడి, రోడ్డుపై ఆగి ఉన్న కారు వెనుక నుంచి హారన్ కొట్టారన్న కోపంతో ఇద్దరు యువకులను కొట్టి రచ్చకెక్కిన రామ్ చరణ్ ఆ తర్వాత ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయాడు. అదే తరహాలో ఎన్టీయార్ గురించి కూడా కెరీర్ తొలినాళ్లలో మరియు “శక్తి” సినిమా టైమ్ లో విపరీతమైన నెగిటివ్ న్యూస్ వెబ్ సైట్స్ లో వచ్చేవి.
అయితే.. గత కొన్నేళ్లుగా కాస్త గట్టిగా గమనిస్తే ఈ ఇద్దరు కథానాయకుల మీద ఎలాంటి నెగిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే వార్తలు కానీ క్రియేట్ అవ్వలేదు. రామ్ చరణ్ “రంగస్థలం”తో సూపర్ హిట్ కొట్టి యాక్టర్ గా, కుదిరినంతలో తన అభిమానులకు, జనాలకు సహాయం చేసి వ్యక్తిగాను ఎదిగాడు. ఇక ఎన్టీయార్ అయితే “బిగ్ బాస్” షో మరియు హ్యాట్రిక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇదంతా వాళ్ళు నియమించుకొన్న పి.ఆర్ టీం ఎఫర్టా లేక వాళ్ళు నిజంగానే మంచివాళ్ళుగా మారారా అనేది పక్కనపెడితే.. ప్రస్తుతానికి రామ్ చరణ్, ఎన్టీయార్ లు మంచి డొస్తులు మాత్రమే కాదు త్వరలోనే కలిసి రాజమౌళి సినిమాలోనూ నటించనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు భావి హీరోలకు మాత్రమే కాదు ప్రెజంట్ హీరోలుగా కెరీర్ లు సాగిస్తున్నవారందరికీ ఆదర్శంగా నిలిచారు.