పర భాషల్లోనూ మార్కెట్ పెంచుకోవాలని తారక్ ప్లాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనసులోని మాట బయటికి వచ్చింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న ఈ హీరో తర్వాత సినిమా ప్రకటనపై అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా తారక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ సిద్ధంగా ఉన్నా ఆలస్యానికి కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. జనతా గ్యారేజ్ తో కేరళలో అడుగు పెట్టిన ఎన్టీఆర్, తమిళంలోనూ పాగా వేయాలని ఆశిస్తున్నారంట.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగ దాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ ద్వి భాషా చిత్రం చేస్తున్నారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా లింగు స్వామి తో కలిసి తమిళియన్ల మనసు దోచుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. అదే తరహాలో ఒకేసారి  తెలుగు, తమిళ భాషలో చిత్రం చేయాలనీ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారని తెలిసింది. కోలీవుడ్ లో తన ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని, అందుకే అక్కడి, ఇక్కడి  ప్రాంతాలకు సూటయ్యే కథ కోసం తారక్ గాలిస్తున్నట్లు అయన సన్నిహితులు వెల్లడించారు.

అందుకే వక్కంతు వంశీ, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ కథలను హోల్డ్ లో పెట్టినట్లు వారు తెలిపారు. అయితే తెలుగు, తమిళ్ సినిమాలపై పట్టు ఉన్న డైరక్టర్ కే తారక్ ఒకే చెప్పేటట్టు ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus