Jr NTR: తారక్ 30 మూవీ కొత్త స్క్రిప్ట్ అలా ఉండనుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాసినిమాకు లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమాలో కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో తారక్ ఇప్పటికే బరువు తగ్గారు. స్లిమ్ లుక్ లో తారక్ అదుర్స్ అనేలా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా సినిమాసినిమాకు తారక్ రేంజ్, మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్30 మూవీ కథ మళ్లీ మారింది. రొటీన్, కమర్షియల్ కథలతో తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు ఆకట్టుకోవడం లేదు.

అదే సమయంలో డివోషనల్ టచ్ తో, కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలు మాత్రం అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నాయి. విష్ణువుకు పక్షుల రాజు గరుడకు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో పునర్జన్మలకు కారణమయ్యే మెటా ఫిజిక్స్, అంత్యక్రియల కర్మల గురించి చర్చించనున్నారని బోగట్టా. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో కొరటాల శివ కథ, కథనం ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను ఫైనల్ చేయనున్నారు. గతంలో కొరటాల శివ విద్యార్థుల రాజకీయాలకు సంబంధించిన కథాంశంను ఈ సినిమా కోసం ఎంచుకోగా ఆ కథను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి తారక్ కొరటాల శివ కాంబో మూవీ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతుండగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై తారక్ దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను ఫైనల్ చేయనున్నారని బోగట్టా.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus