రామారావు ‘EMK’ టీజర్‌ చూశారా?

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’… ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో కొన్ని సీజన్లు నడిచాయి. నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్లు హోస్ట్‌ చేసి వావ్‌ అనిపించారు. ఇప్పుడు నందమూరి తారక రామారావు వంతు వచ్చింది. స్టేజీ ఏదైనా… బెంచ్‌ మార్క్‌ బలంగా సెట్‌ చేసే తారక్‌… మరోసారి బుల్లితెర మీదకు రాబోతున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ మార్చి త్వరలో టెలీకాస్ట్‌ చేయబోతున్నారు. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. అందులో తారక్‌ భలే ముచ్చటగా కనిపించాడు.

షోను వివరించేలా మొదలైన ప్రోమో… ఆఖరులో ఒక ఊహించని మాటతో పూర్తయింది. ఈ ఆట గురించి నాకంటే.. మీకే బాగా తెలుసు అంటూ మొదలయ్యే ఈ ప్రోమోలో షో జరిగే విధానం గురించి తనదైన శైలిలో, డిక్షన్‌లో వివరిస్తూ, తనకు మాత్రమే సొంతమైన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించాడు ఎన్టీఆర్‌. లైఫ్‌లైన్ల గురించి వేసిన సెటైర్‌ కానీ, హోస్ట్‌ గురించి వేసిన సెటైర్‌ కానీ.. వావ్‌ అంతే. లక్ష రూపాయల ప్రశ్న తర్వాత పార్టిసిపెంట్ల ‘చెమటల’ సెటైర్‌ అయితే ఇంకా సూపర్‌.

ఇవన్నీ చెప్పి.. వదిలేస్తే ఎన్టీఆర్‌ ఎందుకవుతాడు.. అది ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ఎందుకవుతుంది. అందుకే ఆఖరున ‘కథ మీది, కల మీది, ఆట నాది.. కోటి మీది’ అంటూ ఓ స్ఫూర్తినింపే డైలాగ్‌తో ముగించాడు రామారావు. అదేంటి కొత్తగా తారక్‌ లేదా జూ.ఎన్టీఆర్‌ అనాలి కదా. ఈ రామారావు ఏంటి అనుకుంటున్నారా? ఈ మాట అన్నది మేం కాదు ఆయనే ప్రోమో ఆఖరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. కావాలంటే దిగువ ప్రోమో చూసేయండి. ‘రామారావు’ కాన్సెప్ట్‌ ఏంటో తెలుసుకోండి.


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus