వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని ఇంకో 2,3 దశాబ్డల వరకు ప్రేక్షకులు మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఇప్పటికీ బుల్లితెర పై ఈ చిత్రం మంచి టి.ఆర్.పి ని నమోదు చేస్తూనే ఉంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ లో ప్రతీ పాత్ర ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది అనడంలో కూడా సందేహం లేదు. ఈ కోవలో హీరో, హీరోయిన్లు తర్వాత మనకి ఎక్కువగా గుర్తుండి పోయేది పింకీ పాత్రే .!
ఎందుకంటే.. హీరో, హీరోయిన్లతో సమానంగా ఈ సినిమాలో ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. ఆ పాత్రని పోషించిన నటి సుదీప, అయితే.. ‘నువ్వు నాకు నచ్చావ్’ తర్వాత ఆమె పేరు కూడా సుదీప పింకీ గా మారిపోయింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ తర్వాత సుదీప పింకీ.. ‘బొమ్మరిల్లు’ ‘స్టాలిన్’ ‘బిందాస్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘లెజెండ్’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ఆడియెన్స్ ను కూడా అలరించింది.
ఎం.బి.ఎ వరకు చదువుకున్న ఈ నటి… శ్రీరంగనాథన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది.ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తోంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :